23 నుంచి డీసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ | dee cet web counciling held in 23 | Sakshi
Sakshi News home page

23 నుంచి డీసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌

Jul 21 2016 7:07 PM | Updated on Sep 4 2017 5:41 AM

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): డీఈఈసెట్‌–2016లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈ నెల 23 నుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నట్లు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

– ఆగస్టు ఒకటిన తరగతుల ప్రారంభం

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): డీఈఈసెట్‌–2016లో అర్హత సాధించిన విద్యార్థులకు  ఈ నెల 23 నుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నట్లు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షలో ఓసీలు 40 శాతం, బీసీలు–35, ఎస్సీ ఎస్టీలు–35 శాతం మార్కులు సాధించిన అభ్యర్థుల ర్యాంకులను
WWW.DEECETAP.CGG.GOV.IN
 నందు ఉంచామని పేర్కొన్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌ 23 నుంచి 31వ తేదీ వరకు ఉంటుందని, 23 నుంచి 25వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు, 26 నుంచి 28వ తేదీ వరకు సీట్ల కేటాయింపు, 29న ఆలాట్మెంట్‌ లెటర్ల డౌన్‌లోడ్, 30, 31 తేదీల్లో ప్రభుత్వ డైట్‌ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన, ఆగస్టు ఒకటో తేదీ తరగతులు ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు.
20 నుంచి ఎల్‌పీసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌
ఎల్‌పీ సెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షకు హాజరైన విద్యార్థులకు ఈనెల 20 నుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నట్లు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. 20 నుంచి 22వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు, 23న సీట్ల కేటాయింపు, 24 నుంచి 25వ తేదీ వరకు డైట్‌ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన, ఆగస్టు ఒకటి నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement