ఎరక్కపోయి..ఇరుక్కుపోయింది! | dear fit into stones | Sakshi
Sakshi News home page

ఎరక్కపోయి..ఇరుక్కుపోయింది!

May 29 2017 12:04 AM | Updated on Sep 5 2017 12:13 PM

ఎరక్కపోయి..ఇరుక్కుపోయింది!

ఎరక్కపోయి..ఇరుక్కుపోయింది!

ఓ ఎలుగుబంటి ఇంటి గోడల మధ్య ఇరుక్కుపోయిన సంఘటన మండలంలోని తిప్పనపల్లిలో చోటు చేసుకుంది.

శెట్టూరు :  ఓ ఎలుగుబంటి ఇంటి గోడల మధ్య ఇరుక్కుపోయిన సంఘటన మండలంలోని తిప్పనపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు..సమీపంలోని ఆటవీ ప్రాంతం నుంచి ఓ ఎలుగుబంటి ఆదివారం తెల్లవారుజామున గ్రామంలోకి వచ్చింది. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఓ ఇంటి ఆవరణలోకి చొరబడింది. ఇంటి పక్కనే బండల మధ్య ఇరుక్కుని బయటి రాలేక పోయింది. తెల్లవారగానే స్థానికులు గమనించి పోలీసులకు, ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. 

ఉదయం 10.30 గంటలకు కళ్యాణదుర్గం ఫారెస్ట్‌ రేంజ్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ రామచంద్రానాయక్‌ సిబ్బందితో కలసి ఎలుగుబంటి ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. గ్రామస్తులతో కలిసి  గాబరా చేసి ఎలుగుబంటి బయటకు పంపేశారు. కాగా ఎలుగుబంటిని పట్టుకోకుండా వదిలివేయడంతో ఫారెస్టు అధికారులపై సర్పంచ్‌ గోవింద్‌రెడ్డి, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

పోల్

Advertisement