తండ్రికి కుమార్తె అంత్యక్రియలు | Daughter performs final rites | Sakshi
Sakshi News home page

తండ్రికి కుమార్తె అంత్యక్రియలు

Jul 27 2016 9:43 PM | Updated on Sep 4 2017 6:35 AM

తండ్రికి కుమార్తె అంత్యక్రియలు

తండ్రికి కుమార్తె అంత్యక్రియలు

గంగపట్నం(ఇందుకూరుపేట): సంప్రదాయం ప్రకారం తండ్రి మరణిస్తే కుమారులు తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించడం సర్వ సాధారణం. అందుకు భిన్నంగా కుమార్తె అంత్యక్రియలు నిర్వహించి తండ్రి రుణం తీర్చుకుందో కుమార్తె. ఈ సంఘటన మండలంలోని గంగపట్నం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

 
గంగపట్నం(ఇందుకూరుపేట): సంప్రదాయం ప్రకారం  తండ్రి మరణిస్తే కుమారులు తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించడం సర్వ సాధారణం. అందుకు భిన్నంగా కుమార్తె అంత్యక్రియలు నిర్వహించి తండ్రి రుణం తీర్చుకుందో కుమార్తె. ఈ సంఘటన  మండలంలోని గంగపట్నం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గంగపట్నం గ్రామానికి చెందిన ఆలపాకల మల్లికార్జున(46) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు బుధవారం నిర్వహిచేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు ఏర్పాట్లు చేశారు.
కాగా కుమారుడు పుట్టిన తరువాత భార్య చనిపోవడంతో మల్లికార్జున మరో వివాహం చేసుకున్నాడు. తొలి భార్య కుమారుడు అనిల్‌ తండ్రి నుంచి దూరమయ్యాడు. అదే గ్రామంలో ఉన్న అమ్మమ్మ దగ్గర పెరుగుతున్నాడు. మల్లికార్జున లక్ష్మమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకోవడంతో ఆమెకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ప్రియాంకకు ఆగస్టు మొదటి వారంలో వివాహం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
చిన్న కుమార్తె ప్రవళిక ఇంటర్‌ చుదువుతోంది. కాగా హఠాన్మరణం చెందిన మల్లికార్జునకు తలికొరివి పెట్టేందుకు తొలి భార్య కుమారుడు అనిల్‌  నిరాకరించడంతో ఆ బాధ్యతను చిన్నకుమార్తె చేపట్టింది. తలకొరివి పెట్టి తండ్రి రుణం తీర్చుకుంది. ఈ సంఘటన చుట్టు ప్రక్కల గ్రామాలలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement