జనగామ జిల్లా జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి పిస్టల్ లైసెన్స్ రద్దు కోసం జిల్లా రెవెన్యూ అధికారి మంగళవారం నోటీసు పంపించారు. ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా సిఫార్సు మేరకు డీఆర్‌ఓ శోభ దశమంతరెడ్డికి ఈ నోటీసులు జారీ చేశారు. జనగామలో జరుగుతున్న ఉద్యమంలో దశమంతరెడ్డి చురుకుగా పాల్గొంటూ శాంతికి విఘాతం కలిస్తున్నారని ఆయనపై అభియోగాలు మోపారు. కాగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దశమంతరెడ్డి మాట్లాడుతూ
-
13లోగా సంజాయిషీ ఇవ్వాలని డీఆర్‌ఓ ఆదేశం
-
నాపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారు
-
జనగామ జిల్లా జేఏసీ చైర్మన్ ఆవేదన
జనగామ : జనగామ జిల్లా జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి పిస్టల్ లైసెన్స్ రద్దు కోసం జిల్లా రెవెన్యూ అధికారి మంగళవారం నోటీసు పంపించారు. ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా సిఫార్సు మేరకు డీఆర్‌ఓ శోభ దశమంతరెడ్డికి ఈ నోటీసులు జారీ చేశారు. జనగామలో జరుగుతున్న ఉద్యమంలో దశమంతరెడ్డి చురుకుగా పాల్గొంటూ శాంతికి విఘాతం కలిస్తున్నారని ఆయనపై అభియోగాలు మోపారు. కాగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దశమంతరెడ్డి మాట్లాడుతూ తెలంగాణlఉద్యమంలో తనపై అనేక కేసులు నమోదు చేసినా, ఏ రోజు కూడా పిస్టల్ ప్రస్తావన రాలేదన్నారు.
జిల్లా కోసం సాగుతున్న ఉద్యమంలో ప్రజల ఆకాంక్ష మేరకు కొట్లాడుతున్న తనపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారన్నారు. తన వ్యక్తిగత భధ్రత కోసం పోలీస్ శాఖకు దరఖాస్తు చేసుకో గా, 2010లో గన్‌కు లైసెన్స్ ఇచ్చారన్నారు. ఈ నెల 13లోగా పిస్టల్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో సంజాయిషీ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నట్లు వెల్లడించారు. జిల్లా ఉద్యమంలో తాను శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారన్నారు. గన్ లైసెన్స్ రద్దు చేసినంత మాత్రాన తన ప్రాణానికి నష్టం లేదని, అండగా ప్రజలు ఉన్నారన్నారు.