నిరుద్యోగులను మోసగించిన వ్యక్తి అరెస్ట్ | Culprit arrested in vizianagaram | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులను మోసగించిన వ్యక్తి అరెస్ట్

Sep 1 2015 11:34 AM | Updated on Aug 11 2018 9:10 PM

విజయనగరం జిల్లా ఎస్ కోటలో రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులకు మోసం చేసి లక్షలాది రూపాయిలను వసూలు చేసి ఆదినారాయణ అనే వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

విజయనగరం : విజయనగరం జిల్లా ఎస్ కోటలో రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులకు మోసం చేసి లక్షలాది రూపాయిలను వసూలు చేసి ఆదినారాయణ అనే వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.... ఎస్ కోటకు చెందిన ఆదినారాయణ అనే వ్యక్తి రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 26 మంది నిరుద్యోగుల వద్ద నుంచి రూ. 68.80 లక్షలు వసూలు చేశాడు.

ఉద్యోగాలు ఎప్పుడు అని నిరుద్యోగులు ప్రశ్నిస్తే రేపు మాపు అంటూ సమాధానం చెబుతున్నాడు. దాంతో ఆదినారాయణ వ్యవహార శైలిని సందేహించిన సదరు నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు ఆదినారాయణను మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆదినారాయణను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement