క్రికెట్‌ టోర్నీ ప్రారంభం | CRICKET TOURNEY STARTED | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ టోర్నీ ప్రారంభం

Aug 22 2016 12:30 AM | Updated on Sep 4 2017 10:16 AM

ధరూరు : క్రీడలు శారీరక దారుఢ్యంతోపాటు మానసికోల్లాసాన్నిస్తాయని టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలో ముస్తఫా స్మారక క్రికెట్‌ పోటీలను ప్రారంభించారు.

ధరూరు : క్రీడలు శారీరక దారుఢ్యంతోపాటు మానసికోల్లాసాన్నిస్తాయని టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలో ముస్తఫా స్మారక క్రికెట్‌ పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులు మైదానంలో క్రీడా స్పూర్తిని ప్రదర్శించాలని కోరారు. ప్రతి ఓటమి గెలుకు పునాది లాంటిదన్నారు. అంతకు ముందు గ్రామ సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి టాస్‌ వేసి క్రీడలను ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, నాయకులు జాకీర్, నిర్వాహకులు ప్రవీణగౌడ్, మహ్మద్, మునీర్, షాకీర్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement