‘నాసిరకం విత్తనాలతో అన్యాయం’ | cpm statement on seeds distribution | Sakshi
Sakshi News home page

‘నాసిరకం విత్తనాలతో అన్యాయం’

Oct 30 2016 1:13 AM | Updated on Aug 13 2018 8:12 PM

నాసిరకం వరి విత్తనాలు సాగు చేసి మోసపోయిన రైతులకు న్యాయం చేయడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం అనుబంధ ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తరిమెల నాగరాజు, ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : నాసిరకం వరి విత్తనాలు సాగు చేసి మోసపోయిన రైతులకు న్యాయం చేయడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం అనుబంధ ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తరిమెల నాగరాజు, ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో పలువురు నాయకులతో కలిసి టెక్నికల్‌ ఏఓలు సి.ప్రతాప్, సి.చెన్నవీరస్వామికి వినతి పత్రం ఇచ్చారు.

ఇటీవల అనంతపురం, రాప్తాడు, గార్లదిన్నె, ఆత్మకూరు, ముదిగుబ్బ తదితర మండలాల పరిధిలో వందలాది మంది రైతులకు బీటీపీ–5204 రకం వరి మాటున నకిలీ విత్తనాలు అంటగట్టిన ఫలితంగా పంట దారుణంగా నష్టపోయిందన్నారు.  నంద్యాల, అనంతపురంలో ఉన్న బాధ్యుల్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సంఘం నాయకులు ఓబిరెడ్డి, ఆర్‌.వెంకటరాముడు, రాగే పరశురాముడు, బి.ఆదినారాయణ, బి.కదిరెప్ప తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement