
బాలకృష్ణ ఉత్తుత్తి హీరోనే
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమాల్లో అవినీతిని అంతమొందించే పాత్రలు పోషిస్తారని..నిజజీవితంలో ఆయన ఉత్తుత్తి హీరోనేనని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ ఆరోపించారు.
► హంద్రీనీవా జలసాధన కోసం బస్సు యాత్ర
► సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్
హిందూపురం: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమాల్లో అవినీతిని అంతమొందించే పాత్రలు పోషిస్తారు.. నిజజీవితంలో నియోజకవర్గంలో అవినీతి పెరిగిపోతున్నా పట్టించుకోరని, ఆయన ఉత్తుత్తి హీరోనేనని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ ఆరోపించారు.
మంగళవారం పట్టణంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుబావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో అవినీతి పేరుకుపోయిందన్నారు. అనంతకు ప్రాణప్రదమైన హంద్రీ-నీవాను పూర్తి చే యడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, హంద్రీనీవా జల సాధ న కోసం జిల్లా కార్యవర్గంలో కార్యచరణను రూపొందించి హిందూపురం నుంచి గుంతకల్లు వరకు బస్సు యాత్ర చేపడతామన్నారు.
అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో సీపీఐ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితంగా కొద్దో, గొప్పో నీళ్లు లభిస్తున్నాయన్నారు. హిందూపురం పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలకు 13 టీఎంసీల నీళ్లు అందించాల్సి ఉన్నప్పటికీ, చుక్కనీరు అందించలేదన్నా రు. లేపాక్షి భూములను అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు వెనక్కిస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా రైతులకు భూములను వెనక్కి ఇవ్వకపోగా.. ఆ భూముల్లో ఒక్క పరిశ్రమను సైతం తీసుకురాలేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్, జిల్లా నాయకుడు రాజారెడ్డి, స్థానిక నాయకులు దాదాపీర్, సురేష్‌బాబు, కేటి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు.