కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో భర్త మృతి చెందగా.. భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
భర్త మృతి, భార్య పరిస్థితి విషమం
తాడిపత్రి : కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో భర్త మృతి చెందగా.. భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రి పట్టణంలోని టైలర్స్ కాలనీకి చెందిన కుళ్లాయప్ప (55), దస్తగిరమ్మ దంపతులు. రెండు రోజుల కిందట భార్యాభర్తలు గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన కుళ్లాయప్ప మంగళవారం విషపుగుళికలు మింగాడు. దీంతో భార్య కూడా ఆ గుళికలను మింగింది.
ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేసి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కుళ్లాయప్ప మృతి చెందాడు. దస్తగిరమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఎఐ ఆంజనేయులు కేసు దర్యాప్తుచే స్తున్నారు.