ట్రాన్స్‌ ఫార్మర్లలో రాగివైరు చోరీ | couper wires theft | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ ఫార్మర్లలో రాగివైరు చోరీ

Jan 10 2017 11:55 PM | Updated on Sep 5 2017 12:55 AM

ట్రాన్స్‌ ఫార్మర్లలో రాగివైరు చోరీ

ట్రాన్స్‌ ఫార్మర్లలో రాగివైరు చోరీ

గోపాలపురం : వాదాలకుంట గ్రామ శివారు పంట పొలాల్లో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు రెండు విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్లను పగులగొట్టి అందులోని రాగివైరును దొంగిలించినట్లు రైతులు మంగళవారం పోలీసు, విద్యుత్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు.

గోపాలపురం : వాదాలకుంట గ్రామ శివారు పంట పొలాల్లో  సోమవారం రాత్రి గుర్తు  తెలియని దుండగులు రెండు విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్లను పగులగొట్టి అందులోని రాగివైరును దొంగిలించినట్లు రైతులు మంగళవారం పోలీసు, విద్యుత్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. వాదాలకుంట గ్రామానికి చెందిన గెడా జోగేంద్రప్రసాద్, గెడా రాంబాబు, జొజ్జవరపు బ్రహ్మానందం, ఈగల చిట్టిబాబులకు చెందిన 25హెచ్‌పీ, 40హెచ్‌పీ ట్రాన్స్‌ ఫార్మర్లలో రాగివైరు దొంగిలించినట్లు వెల్లడించారు. వైరు విలువ సుమారు రూ.80వేలు ఉంటుందని వివరించారు.
 

 

Advertisement

పోల్

Advertisement