మొబైల్‌ ఫోన్‌కు చార్జింగ్‌ పెడుతుండగా విద్యుత్‌ షాక్‌ | mobile charging time electric shock | Sakshi
Sakshi News home page

మొబైల్‌ ఫోన్‌కు చార్జింగ్‌ పెడుతుండగా విద్యుత్‌ షాక్‌

Oct 25 2016 12:28 AM | Updated on Sep 4 2017 6:11 PM

మొబైల్‌ ఫోన్‌కు చార్జింగ్‌ పెడుతుండగా విద్యుదాఘాతనికి గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి వైఎస్సార్‌ జిల్లా పెనగలూరు మండలంలో చోటు చేసుకుంది.

 పెనగలూరు:
 మొబైల్‌ ఫోన్‌కు చార్జింగ్‌ పెడుతుండగా విద్యుదాఘాతనికి గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి వైఎస్సార్‌ జిల్లా పెనగలూరు మండలంలో చోటు చేసుకుంది. నడిమి సిద్దవరం గ్రామానికి చెందిన కోనేటి సుబ్బన్న, గంగమ్మల ఏకైక పుత్రుడు హరినాథ్‌(22) ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నాడు తల్లిదండ్రులు వయో వృద్ధులు కావడంతో చదువు ఆపేసి రాజంపేటలో షూమార్ట్‌లో పనిచేస్తున్నాడు. మొబైల్‌ ఫోన్‌కు చార్జింగ్‌ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. బయట ఉన్న తల్లిదండ్రులు గదిలోకి Ðð ళ్లి చూడగా వెళ్లగా చార్జర్‌ పట్టుకుని అలానే నిలబడి ఉన్నాడు. వెంటనే కింద పడిన  కుమారున్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. లేకలేక కలిగిన కుమారుడు కళ్లముందే కన్నుమూయడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement