8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌ | Counting, starting at 8 pm | Sakshi
Sakshi News home page

8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌

Mar 20 2017 11:08 PM | Updated on Aug 29 2018 6:26 PM

​పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్, ఎన్నికల పరిశీలకులు రాంగోపాల్, రాంశంకర్‌ నాయక్‌ సమక్షంలో కౌంటింగ్‌ ప్రారంభించారు.

 అనంతపురం :

పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపా«ధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్, ఎన్నికల పరిశీలకులు రాంగోపాల్, రాంశంకర్‌ నాయక్‌ సమక్షంలో కౌంటింగ్‌ ప్రారంభించారు. ముందుగా ఎస్పీ రాజశేఖర్‌బాబు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూం తాళాలు తెరిచారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ శశిధర్‌ మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయ నియోజకవర్గానికి 14, పట్టభద్రుల నియోజకవర్గానికి 26 టేబుళ్ల చొప్పున వేర్వేరుగా లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు  చేశామన్నారు. ఈ లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు మూడు షిఫ్టులలో   సిబ్బంది పాల్గొంటారన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ మొత్తం వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల కమిషనర్‌ నేరుగా తిలకించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఢిల్లీ నుంచి ఇద్దరు సీనియర్‌ అధికారులు కౌంటింగ్‌ ప్రక్రియను గమనించేందుకు వచ్చారన్నారు. ఓట్ల లెక్కింపును ఏజెంట్లు ఎప్పటికప్పుడు తిలకించేందుకు అనువుగా కుర్చీలు ఏర్పాటు చేశామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement