అవినీతి నిర్మూలనతోనే ప్రగతి సాధ్యం | Corruption can not be progress | Sakshi
Sakshi News home page

అవినీతి నిర్మూలనతోనే ప్రగతి సాధ్యం

Dec 18 2016 1:54 AM | Updated on Sep 22 2018 8:25 PM

అవినీతి నిర్మూలనతోనే ప్రగతి సాధ్యం - Sakshi

అవినీతి నిర్మూలనతోనే ప్రగతి సాధ్యం

రాజకీయ అవినీతిని ఎప్పుడైతే నిర్మూలించగలమో అప్పుడే దేశం మరింత అభివృద్ధిచెందుతుందని తిరుపతి ఎంపీ వి.వరప్రసాద్‌ తెలిపారు.

ఆలిండియా పెన్షనర్స్‌ డే వేడుకల్లో తిరుపతి ఎంపీ వరప్రసాద్‌
తిరుపతి సెంట్రల్‌ : రాజకీయ అవినీతిని ఎప్పుడైతే నిర్మూలించగలమో అప్పుడే దేశం మరింత అభివృద్ధిచెందుతుందని తిరుపతి ఎంపీ వి.వరప్రసాద్‌ తెలిపారు. స్థానిక ఏపీ ఎన్జీవో కార్యాలయంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్ తిరుపతి శాఖ నిర్వహించిన ఆల్‌ ఇండియా పెన్షనర్స్‌ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం సమాజాంలో రాజకీయ అవినీతి వల్ల అభివృద్ది ఆగి పోయిందన్నారు. రాజకీయ అవినీతిని నిర్మూలించగలిగితే మరో 30 శాతం అదనంగా అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు. రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్  భవన నిర్మాణానికి ఎంపీ నిధు ల నుంచి రూ. 5లక్షల గ్రాంట్‌ను విడుదల చేసినట్టు ఉత్తర్వులు అందించారు. ఇంకనూ తన వంతుగా భవన నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తానని తెలిపా రు.

ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ పెన్షనర్ల భవన నిర్మాణానికి  ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. రిటైరై 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 20 మంది పెన్షనర్లను ఘనం గా సన్మానించారు. రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్ తిరుపతి శాఖ అధ్యక్షుడు పి.కోదండపాణి రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.బాలాజి, ఉపాధ్యక్షులు జయరామయ్య, జిల్లా అధ్యక్షుడు ఎం. కోదండ పాణి రెడ్డి, కోశాధికారి సిద్ద,సబ్‌ కమిటీ సభ్యులు చిన్నబ్బ,జయరామ్,కౌసల్య, కస్తూరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement