కాంట్రాక్టు జూనియర్‌ లెక్చరర్ల వేతనం రూ.27 వేలకు పెంపు | contract junior lecturer salary increase Rs 27 thousand | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు జూనియర్‌ లెక్చరర్ల వేతనం రూ.27 వేలకు పెంపు

Dec 25 2016 12:15 AM | Updated on Sep 4 2017 11:31 PM

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు పెరిగాయి. ప్రస్తుతం వారికిస్తున్న రూ.18 వేల వేతనాన్ని రూ.27 వేలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం


సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు పెరిగాయి. ప్రస్తుతం వారికిస్తున్న రూ.18 వేల వేతనాన్ని రూ.27 వేలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన వేతనాన్ని ఈ నెల నుంచే అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్టు జేఎల్‌ల నియామక సమయంలో పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి రూ.4వేలు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి రూ.5వేల చొప్పున వేతనాలిచ్చారు. 2011లో వారి వేతనాలను రూ.18 వేలకు పెంచారు. ఈ క్రమంలో జేఎల్‌ కాంట్రాక్టును పొడిగించిన నేపథ్యంలో వేతన పెంపునకు సంబంధించి ప్రతిపాదనల్ని ఉన్నత విద్యాశాఖ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ క్రమంలో వారి కాంట్రాక్టు పొడిగించిన ప్రభుత్వం.. తాజాగా వేతనాన్ని రూ.27 వేలకు పెంచింది. దీంతో జనవరి ఒకటో తేదీన రాష్ట్రంలోని 3,687 మంది కాంట్రాక్టు లెక్చరర్ల ఖాతాల్లో పెరిగిన వేతనం జమ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement