చినకాపవరం(ఆకివీడు) : విద్యార్థులు చదువులో మమేకం కావాలని జాయింట్ కలెక్టర్ టి.కోటేశ్వరరావు సూచించారు. చినకాపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులతో గురువారం ఆయన ముచ్చటించారు.
చదువులో మమేకమవ్వాలి
Aug 4 2016 10:59 PM | Updated on Sep 4 2017 7:50 AM
చినకాపవరం(ఆకివీడు) : విద్యార్థులు చదువులో మమేకం కావాలని జాయింట్ కలెక్టర్ టి.కోటేశ్వరరావు సూచించారు. చినకాపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులతో గురువారం ఆయన ముచ్చటించారు. గంటసేపు వారితో గడిపారు. భవిష్యత్తు ప్రణాళికలు ముందే నిర్దేశించుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. జేసీ వెంట తహసీల్దార్ వి.నాగార్జునరెడ్డి, సీఎస్‌డీటీ సత్యనారాయణ, ఆర్‌ఐ నాగేశ్వరరావు, సర్పంచ్ దారపురెడ్డి కనకయ్య, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మర్రివాడ వెంకట్రావు, అభివద్ధి కమిటీ చైర్మన్ ఐఎస్‌ఎన్.రాజు, ప్రధానోపాధ్యాయుడు రామానుజాచార్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement