గ్రామీణులు క్రీడల్లో రాణించాలి | complete volleyball tournament | Sakshi
Sakshi News home page

గ్రామీణులు క్రీడల్లో రాణించాలి

Sep 29 2016 10:01 PM | Updated on Mar 19 2019 7:00 PM

గ్రామీణ యువత క్రీడల్లో మరింత రాణించాలని వైఎస్సార్‌ సీపీ అనపర్తి కో ఆర్డినేటర్, గంగిరెడ్డి నర్సింగ్‌హోం అధినేత డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. కడియం మండలం జేగురుపాడులో నిర్వహించిన మద్దుకూరి శాంతకుమారి మెమోరియల్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌ గురువారంతో ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి 15 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. గురువారం ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ సభకు సూర్యనారాయణరెడ్డి

  • వైఎస్సార్‌ సీపీ అనపర్తి కో ఆర్డినేటర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి
  • ముగిసిన వాలీవాల్‌ టోర్నీ
  • జేగురుపాడు (కడియం) :
    గ్రామీణ యువత క్రీడల్లో మరింత రాణించాలని వైఎస్సార్‌ సీపీ అనపర్తి కో ఆర్డినేటర్, గంగిరెడ్డి నర్సింగ్‌హోం అధినేత డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. కడియం మండలం జేగురుపాడులో నిర్వహించిన మద్దుకూరి శాంతకుమారి మెమోరియల్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌ గురువారంతో ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి 15 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. గురువారం ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ సభకు సూర్యనారాయణరెడ్డి, రాజమహేంద్రవరం రూరల్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ముఖ్య అతిథులుగా విచ్చేశారు. పార్టీ నాయకుడు యాదల సతీష్‌చంద్ర స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలన్నారు. ఆకుల వీర్రాజు మాట్లాడుతూ పెద్దఎత్తున క్రీడా పోటీలు నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. టోర్నీ విజేతగా నిలిచిన ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామానికి చెందిన జట్టుకు రూ.10 వేలు, రన్నర్స్‌గా నిలిచిన కడియం మండలం బుర్రిలంక జట్టుకు రూ. 6 వేలు అందించారు. అనంతరం మద్దుకూరి బాలు వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో దూర్వాసుల సాయిబాబు, పుట్టా బుజ్జి, మద్దుకూరి పుల్లయ్య, పెనుమాక ఆనంద్‌కుమార్, రంకిరెడ్డి సుబ్రహ్మణ్యం, అంబేద్కర్‌  యూత్‌ సభ్యులు మెల్లిమి చంటిబాబు, కోలమూరి అశోక్, వర్షాల నాని పాల్గొన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement