ప్రశాంతంగా దేహదారుఢ్య పరీక్షలు | Clear dehadarudhya tests | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా దేహదారుఢ్య పరీక్షలు

Aug 3 2016 11:48 PM | Updated on Sep 4 2017 7:40 AM

గ్రౌండ్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ

గ్రౌండ్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ

కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా నగరంలోని పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో బుధవారం దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి.

ఖమ్మం క్రైం: కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా నగరంలోని పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో బుధవారం దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. ఈ పరీక్షలకు 17వ రోజయిన  బుధవారం 1200మందికిగాను 947మంది హాజరయ్యారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షం కారణంగా ఈవెంట్ల నిర్వహణ కొంత ఆలస్యమైంది. అభ్యర్థుల 800 మీటర్ల పరుగు పందెం రికార్డులను భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్, డీఎస్పీ సాయిశ్రీ నమోదు చేశారు. మైదానంలో ఎస్పీ కలియతిరుగుతూ వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీలు అశోక్‌కుమార్, రాంరెడ్డి, సురేందర్‌రావు, వీరేశ్వరారవు, సురేష్‌కుమార్, సంజీవ్, మాణిక్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement