‘ఖైదీ నంబర్ 150’ చిత్రం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిందని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ అన్నారు. కాకినాడ లో మంగళవారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర చలనచిత్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు
ఖైదీ నంబర్ 150 రూ.102 కోట్ల వసూళ్లతో రికార్డు
Jan 17 2017 10:59 PM | Updated on Jul 25 2018 3:13 PM
కాకినాడ రూరల్ :
‘ఖైదీ నంబర్ 150’ చిత్రం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిందని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ అన్నారు. కాకినాడ లో మంగళవారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర చలనచిత్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో నాలుగు రోజులకు రూ.102 కోట్ల వసూలు చేసి చరిత్ర సృష్టించినట్లు వినాయక్ వివరించారు. ఏ చలన చిత్రం కూడా తక్కువ రోజుల్లో భారీగా కలెక్షన్లు వసూలు చేయలేదన్నారు. మొదటి రోజు మాదిరిగానే ఇప్పటికీ కలెక్షన్లు ఉన్నాయన్నారు. ఈ చిత్రం విజయోత్సవ సభను ఏర్పాటు చేస్తామని, అది ఎక్కడ ఏర్పాటు చేసేదీ త్వరలోనే వెల్ల డించనున్నట్లు తెలిపారు.
సొంత కథతో ‘చిరు’ హీరోగా సినిమా
పిఠాపురం టౌ¯ŒS (పిఠాపురం) : తన సొంత కథతో, మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వి.వి. వినాయక్ వెల్ల డించారు. మంగళవారం పిఠాపురం వచ్చిన ఆయనకు అభిమాను లు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన దర్శకత్వం వహించిన ఖైదీ నంబర్ 150 సినిమా ప్రదర్శిస్తున్న స్థానిక సత్యా థియేటర్‌లో కొంతసేపు విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఖైదీ నంబర్ 150 సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందన్నారు. మెగాస్టార్‌కు ఉన్న ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదని వినాయక్ అన్నారు. సుమారు 2500 థియేటర్లలో ఈ సినిమా విడుదలై, వారం తిరగకుండానే రూ.125 కోట్లకు పైగా వసూలు చేసిందన్నారు. థియేటర్ యాజమాని దేవరపల్లి చినబాబు, పట్టణ మెగా అభిమానుల సంఘం సభ్యులు ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
Advertisement
Advertisement