ఐదో తరగతి విద్యార్థినికి వివాహం! | child marriage in Kanaganapalle | Sakshi
Sakshi News home page

ఐదో తరగతి విద్యార్థినికి వివాహం!

Apr 17 2016 3:30 PM | Updated on Sep 3 2017 10:08 PM

ఐదో తరగతి విద్యార్థినికి వివాహం!

ఐదో తరగతి విద్యార్థినికి వివాహం!

ఐదో తరగతి చదువుతున్న చిన్నారికి వివాహం చేశారు తల్లిదండ్రులు. ఈ ఘటన అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం వేపకుంట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

కనగానపల్లి (అనంతపురం) : ఐదో తరగతి చదువుతున్న చిన్నారికి వివాహం చేశారు తల్లిదండ్రులు. ఈ ఘటన అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం వేపకుంట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఐదో తరగతి చదివే బాలిక(10)ను ఓ యువకుడు (20) స్థానిక పోతలయ్య ఆలయంలో వివాహం చేసుకున్నాడు. 
 
సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు, పోలీసులతో కలసి గ్రామానికి చేరుకుని విచారించారు. తమ కులం ఆచారాల ప్రకారం రజస్వల కాని అమ్మాయిని వివాహం చేసుకోవాలని వరుడి తరఫు వారు చెప్పగా, అది తప్పని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికను ఐసీడీఎస్ అధికారులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement