breaking news
Kanaganapalle
-
ఏపీ డీజీపీకి వైఎస్ జగన్ లేఖ
విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఏపీ డీజీపీ సాంబశివరావుకు లేఖ రాశారు. అనంతపురం జిల్లా కనగానపల్లె ఎంపీపీ ఎన్నికల్లో అధికార పార్టీ టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని కోరారు. డీజీపీ కార్యాలయంలో లా అండ్ ఆర్డర్ ఐజీ గుప్తాకు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పీ గౌతమ్ రెడ్డి ఈ లేఖను అందజేశారు. కనగానపల్లె ఎంపీపీ ఎన్నికల విషయంలో వైఎస్ఆర్సీపీ నేతలు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి.. పార్టీ అధినేత జగన్ రాసిన లేఖను ఆయనకు అందజేశారు. కనగానపల్లె ఎంపీపీ ఎన్నికలను నిష్పాక్షికంగా జరుపాలని వారు ఎన్నికల కమిషనర్‌ను కోరారు. మంత్రి పరిటాల సునీత దౌర్జన్యానికి పాల్పడాలని చూస్తున్నారని, బలం లేకున్నా ఎంపీపీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టారని వైఎస్సార్సీపీ నేతలు పార్థసారథి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, కన్నబాబు పేర్కొన్నారు. -
ఐదో తరగతి విద్యార్థినికి వివాహం!
కనగానపల్లి (అనంతపురం) : ఐదో తరగతి చదువుతున్న చిన్నారికి వివాహం చేశారు తల్లిదండ్రులు. ఈ ఘటన అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం వేపకుంట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఐదో తరగతి చదివే బాలిక(10)ను ఓ యువకుడు (20) స్థానిక పోతలయ్య ఆలయంలో వివాహం చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు, పోలీసులతో కలసి గ్రామానికి చేరుకుని విచారించారు. తమ కులం ఆచారాల ప్రకారం రజస్వల కాని అమ్మాయిని వివాహం చేసుకోవాలని వరుడి తరఫు వారు చెప్పగా, అది తప్పని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికను ఐసీడీఎస్ అధికారులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు. -
కనగానపల్లిలో భారీ వర్షం
కనగానపల్లి (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలో గురువారం 50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం మండల కేంద్రంలో కురిసిన భారీ వర్షంతో పలు గ్రామాల్లోని చెరువులు నిండిపోయాయి. మండలంలోని ముత్తుకుంట్ల, తల్లిమడుగుల, బావిలూరు, కొండపల్లి, తగరకుంట గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లోని పలు చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. తల్లిమడుగుల గ్రామంలో చెరువు నిండిపోయింది. అయితే చెరువు కట్టకు గండి పడటంతో చెరువులో నుంచి నీరు వృథాగా పోతుంది. కాగా మండలంలో మూడేళ్ల తర్వాత భారీ వర్షం కురిసిందని.. చెరువులు, కుంటలు నీటితో నిండిపోయాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.