వ్యాక్సిన్‌ వికటించి మూడు నెలల చిన్నారి మృతి | child dead | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌ వికటించి మూడు నెలల చిన్నారి మృతి

Apr 21 2017 12:16 AM | Updated on Sep 5 2017 9:16 AM

వ్యాక్సిన్‌ వికటించడంతో మూడు నెలల బాబు మృతి చెందిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం జీఎం వలస మన్యం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. జీఎం వలస గ్రామానికి చెందిన కలుముల చిరంజీవి దొర, రాములమ్మ దంపతులకు గత

మారేడుమిల్లి, (రంపచోడవరం) : 
వ్యాక్సిన్‌  వికటించడంతో మూడు నెలల బాబు మృతి చెందిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం జీఎం వలస మన్యం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. జీఎం వలస గ్రామానికి చెందిన కలుముల చిరంజీవి దొర, రాములమ్మ దంపతులకు గత ఏడాది వివాహం జరిగింది. గర్భవతి అయిన రాములమ్మకు  ఈ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో బాబుకి జన్మనిచ్చింది. బాబుకు మూడో నెల కావడంతో బుధవారం ఉదయం జీఎం వలస గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రానికి తీసుకువెళ్లగా అక్కడ ఏఎ¯ŒSఎం పెంటావాలెంట్, ఓపీవీ, వ్యాక్సిన్‌ వేశారు. ఆ రోజు రాత్రి వరకూ బాబు బాగానే ఉన్నాడని గురువారం వేకువ జామున బాబుకు వాంతులు, విరేచనాలవడంతో ఉదయం స్థానిక పీహెచ్‌సీకి  తరలించగా విధుల్లో ఉన్న డాక్టర్‌ సృజ¯ŒS పరిశీలించగా అప్పటికే మృతి చెందాడని తెలిపారు. ఈ సంఘటనపై ఆడిషనల్‌ డీఎంఆండ్‌ హెచ్‌వో పవ¯ŒS కుమార్‌ను వివరణ కోరగా ఈ సంఘటనపై కాకినాడ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, దీనిపై పూర్తి  విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement