maredimilli
-
అగ్రనేతలతో సహా లొంగిపోనున్న 37 మంది మావోయిస్టులు
సాక్షి, హైదరాబాద్: కీలక నేతల లొంగుబాటు.. అగ్రనేతల ఎన్కౌంటర్లతో కకావికలం అవుతున్న మావోయిస్టు పార్టీకి మరో భారీదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ ఎదుట ఇవాళ(నవంబర్ 22, శనివారం) భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. వీళ్లలో ముఖ్యనేతలతో పాటు కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు 37 మంది దాకా ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్తో మావోయిజం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని.. అభివృద్ధిలో భాగం కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. మావోయిస్టు అగ్రనేత ఆజాద్‌తో పాటు కీలక సభ్యులు రమేష్, అప్పాసి నారాయణ, ఎర్రాలు లొంగిపోతారని తెలుస్తోంది. వీళ్లిద్దరితో పాటు 20 మంది దాకా డివిజన్ ఏరియా కమిటీ సభ్యులు ఆయుధాలతో సహా లొంగిపోనున్నారు. అజాద్ 1995 నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. ఉద్యమంలో పురోగమించే అవకాశం లేదని గ్రహించిన నేపథ్యంలోనే ఈ దిశగా అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాదిలో.. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, బాలకృష్ణ, గణేశ్, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి, హిడ్మా వరుస ఎన్కౌంటర్లలో మృతి చెందారు. పార్టీకి ఎదురవుతున్న గడ్డు పరిస్థితుల నేపథ్యంలో అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లొంగిపోయారు. ఇక.. అనారోగ్య కారణాలతో చంద్రన్న, బండి ప్రకాశ్ ఆయుధాలు వీడారు. మరో నలుగురు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, పదుల సంఖ్యలో పార్టీ క్యాడర్ లొంగిపోయే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నాం డీజీపీ శివధర్‌రెడ్డి మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.ప్రజాప్రతినిధులు బయట తిరగొద్దు!అల్లూరి: మారుడుమిల్లి ఎన్కౌంటర్ల నేపథ్యంతో రేపు ఏజెన్సీ బంద్, నిరసనలకు మావోయిస్టులు పిలుపు ఇచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రంపచోడవరం వ్యాప్తంగా ఆంక్షలు విధించి.. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులను ఏజెన్సీల్లో పర్యటించొద్దని.. వీళైతే మైదానాల్లోకి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. ఈ నెల 18, 19వ తేదీల్లో జరిగిన ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు మరణించారు. -
అల్లూరి జిల్లాలో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి
సాక్షి, అల్లూరి జిల్లా: మారేడుమిల్లి టైగర్‌జోన్‌లో మంగళవారం భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ ఎన్‌కౌంటర్‌ను ధృవీకరించారు. మృతుల్లో అగ్రనేత ఒకరు ఉన్నారని ఆయన తెలియజేయగా.. అది మడావి హిడ్మానే అనే ప్రచారం ఊపందుకుంది.ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోల కదిలికపై సమాచారం అందడంతో టైగర్‌జోన్ ఏరియాలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఈ ఉదయం(6-7గం. మధ్య) ఇరు వర్గాలు ఎదురుపడి కాల్పులకు దిగాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో(ఎక్సేంజ్ ఆఫ్ ఫైర్) మావోయిస్టులు ఆరుగురు మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.Andhra Pradesh | In the Alluri Sitarama Raju district, an exchange of fire took place between the police and Maoists in Maredumilli. The encounter occurred between 6 AM and 7 AM. In the exchange of fire, six Maoists were killed, including a top Maoist leader. A massive combing…— ANI (@ANI) November 18, 2025మృతుల్లో హిడ్మా?మారేడుమిల్లి ఎన్కౌంటర్ మృతుల్లో.. మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హిడ్మా, ఆయన భార్య హేమతో పాటు మరో నలుగురు మావోయిస్టులు చనిపోయారన్నది ఆ ప్రచార సారాంశం. హిడ్మాపై కోటి రూపాయల రివార్డు ఉండగా.. ఆయన భార్య హేమపై రూ.50 లక్షల రివార్డు ఉంది. చనిపోయింది మడావి హిడ్మానేనా.. అనేది ధృవీకరణ కావాల్సి ఉంది. ఒకవేళ అదే నిజమైతే గనక మావోయిస్టు ఉద్యమం పని అయిపోయినట్లేనని విశ్లేషకులు అంటున్నారు.మరోవైపు.. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎర్రబోర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవి ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు మంగళవారం తెల్లవారుజాము నుంచి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. సెర్చ్‌లో భాగంగా ఎర్రబోర్ అటవీ ప్రాంతంలో ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టులను ముట్టడించాయి. ఈ క్రమంలోనే వారి మధ్య భీకరంగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. అయితే కాల్పుల్లో కొందరు మావోయిస్టులు గాయపడినట్ల సమాచారం అందుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌ను జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు. అయితే.. కాల్పులు జరిగిన ఖచ్చితమైన ప్రదేశం, పాల్గొన్న బలగాల సంఖ్య వంటి కీలక వివరాలను ప్రస్తుతం వెల్లడించలేమని ఆయన అన్నారు. -
వ్యాక్సిన్ వికటించి మూడు నెలల చిన్నారి మృతి
మారేడుమిల్లి, (రంపచోడవరం) : వ్యాక్సిన్ వికటించడంతో మూడు నెలల బాబు మృతి చెందిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం జీఎం వలస మన్యం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. జీఎం వలస గ్రామానికి చెందిన కలుముల చిరంజీవి దొర, రాములమ్మ దంపతులకు గత ఏడాది వివాహం జరిగింది. గర్భవతి అయిన రాములమ్మకు ఈ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో బాబుకి జన్మనిచ్చింది. బాబుకు మూడో నెల కావడంతో బుధవారం ఉదయం జీఎం వలస గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రానికి తీసుకువెళ్లగా అక్కడ ఏఎ¯ŒSఎం పెంటావాలెంట్, ఓపీవీ, వ్యాక్సిన్ వేశారు. ఆ రోజు రాత్రి వరకూ బాబు బాగానే ఉన్నాడని గురువారం వేకువ జామున బాబుకు వాంతులు, విరేచనాలవడంతో ఉదయం స్థానిక పీహెచ్‌సీకి తరలించగా విధుల్లో ఉన్న డాక్టర్ సృజ¯ŒS పరిశీలించగా అప్పటికే మృతి చెందాడని తెలిపారు. ఈ సంఘటనపై ఆడిషనల్ డీఎంఆండ్ హెచ్‌వో పవ¯ŒS కుమార్‌ను వివరణ కోరగా ఈ సంఘటనపై కాకినాడ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, దీనిపై పూర్తి విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.


