నీటితొట్టెలో పడి చిన్నారి మృతి | child dead | Sakshi
Sakshi News home page

నీటితొట్టెలో పడి చిన్నారి మృతి

Aug 1 2016 1:02 AM | Updated on Sep 4 2017 7:13 AM

కేఎన్‌పురం (దెందులూరు): దెందులూరు మండలం కేఎన్‌ పురంలోని ఉండ్రాజవరపు శ్రీను, సుజాతల కుమార్తె హాసిని (3) నీటితొట్టెలో పడి మృతిచెందింది.

 కేఎన్‌పురం (దెందులూరు): దెందులూరు మండలం కేఎన్‌ పురంలోని ఉండ్రాజవరపు శ్రీను, సుజాతల కుమార్తె హాసిని (3) నీటితొట్టెలో పడి మృతిచెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం హాసిని  స్నానం చేసేందుకు నీటితొట్టె వద్దకు వెళ్లింది. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు నీటితొట్టె వద్దకు వెళ్లి చూడగా దానిలో పడి ఉంది. వెంటనే చిన్నారి హాసినిని భీమడోలు వైద్యశాలకు తీసుకువెళ్లారు. అప్పటికే హాసిని మృతిచెందినట్టు వైద్యులు చెప్పడంతో దంపతులిద్దరూ కన్నీరు మున్నీరయ్యారు. శ్రీను వ్యవసాయ కూలీ. ఆయనకు ఇద్దరు కుమార్తెలు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement