ఉత్సాహంగా ఓపెన్‌ చెస్‌ పోటీలు | chess compitetion | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఓపెన్‌ చెస్‌ పోటీలు

Aug 7 2016 11:08 PM | Updated on Sep 4 2017 8:17 AM

ఉత్సాహంగా సాగుతున్న చెస్‌ పోటీల్లో చిన్నారుల ఎత్తుకుపైఎత్తులు

ఉత్సాహంగా సాగుతున్న చెస్‌ పోటీల్లో చిన్నారుల ఎత్తుకుపైఎత్తులు

శ్రీకాకుళం నగరంలోని స్కూల్‌ ఆఫ్‌ చెస్‌ అకాడమీలో జరిగిన సర్దార్‌ గౌతు లచ్చన్న మెమోరియల్‌ జిల్లా స్థాయి ఓపెన్‌ చెస్‌ పోటీలు ఉత్సహంగా సాగాయి. ఆదివారం ఐదు రౌండ్లపాటు జరిగిన ఈ పోటీల్లో 30 మంది వరకు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం 1వ పట్టణ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.చిన్నంనాయుడు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరై విజేతలకు జ్ఞాపికలను అందజేశారు.

శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం నగరంలోని స్కూల్‌ ఆఫ్‌ చెస్‌ అకాడమీలో జరిగిన సర్దార్‌ గౌతు లచ్చన్న మెమోరియల్‌ జిల్లా స్థాయి ఓపెన్‌ చెస్‌ పోటీలు ఉత్సహంగా సాగాయి. ఆదివారం ఐదు రౌండ్లపాటు జరిగిన ఈ పోటీల్లో 30 మంది వరకు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం 1వ పట్టణ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.చిన్నంనాయుడు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరై విజేతలకు జ్ఞాపికలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదరంగం క్రీడ మేధావుల క్రీడ అని, అలాంటి క్రీడను చిన్నారులు ఎంచుకోవడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో కోచ్‌ బి.చిన్నారావు, వాసు, అప్పలనాయుడు, ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే
బాల బాలికల ఓపెన్‌ టోర్నీ విజేతగా ఎ. హరీష్‌మణికంఠ నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఎ.లక్ష్మణరావు, బీబీ రమణ, బి.సుందర్రావు, పి.రమేష్, ఆర్‌.సాత్విక్, జి. గణేష్, సీహెచ్‌ఎల్‌ గాయత్రి, కె.శ్రీవి, పి.రాహుల్‌ వివిధ విభాగాల్లో విజేతలగా నిలిచారు. 
 

Advertisement
Advertisement