లక్కీ డ్రా పేరుతో ఫోన్‌ కాల్‌ | Cheating through phone call | Sakshi
Sakshi News home page

లక్కీ డ్రా పేరుతో ఫోన్‌ కాల్‌

Oct 15 2016 2:17 AM | Updated on Sep 4 2017 5:12 PM

లక్కీ డ్రా పేరుతో ఫోన్‌ కాల్‌

లక్కీ డ్రా పేరుతో ఫోన్‌ కాల్‌

నార్తురాజుపాళెం (కొడవలూరు) : లక్కీ డ్రాలో బహుమతి గెలుపొందారని ఫోన్‌ కాల్‌తో ఎర వేసి రూ.4 వేలు కాజేసిన ఉదంతం నార్తురాజుపాళెంలో శుక్రవారం వెలుగుచూసింది.

 
  • ఫోన్‌కు బదులు దేవుడి వస్తువులు  
నార్తురాజుపాళెం (కొడవలూరు) : లక్కీ డ్రాలో బహుమతి గెలుపొందారని ఫోన్‌ కాల్‌తో ఎర వేసి రూ.4 వేలు కాజేసిన ఉదంతం నార్తురాజుపాళెంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఉయ్యాల మధుసూదన్‌రావుకు పది రోజుల క్రితం 85108 52576 నంబరు నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. తాము ఢిల్లీలోని శ్యామ్‌సంగ్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నామని, పూర్తి వివరాలు ఇస్తే పోస్టల్‌ ద్వారా రూ.15 వేలు విలువైన శ్యామ్‌సంగ్‌ జే–7 ఫోన్‌ పంపుతామని తెలిపారు. పార్శిల్‌ అందాక వారికి రూ.4 వేలు చెల్లించవచ్చని సూచించారు. పోస్టుద్వారా మధుసూదన్‌రావుకు ఒక పార్శిల్‌ రావడంతో డబ్బులు చెల్లించి తీసుకుని ఇంటికి వచ్చి ఆనందంగా తెరిచారు. అందులో బంగారు రంగు పూత వేసిన చిన్నచిన్న దేవుడి వస్తువులు ఉన్నాయి. తాను మోసపోయినట్లు గ్రహించి  పోలీసుల దృష్టికి తీసుకుపోయారు. 
 
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement