90 వేల మందికి అందని చంద్రన్న కానుక | chandranna gift 90 thousend members not reached | Sakshi
Sakshi News home page

90 వేల మందికి అందని చంద్రన్న కానుక

Jan 18 2017 11:30 PM | Updated on Jul 28 2018 5:45 PM

రేష¯ŒS కార్డుదారులకు ప్రభుత్వం క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని చంద్రన్న కానుక పేరుతో అందజేసిన సరుకుల పంపిణీ గడువు బుధవారం రాత్రితో ముగిసింది. క్రిస్మస్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఆయావర్గాల కార్డుదారులకు 15వ తేదీలోపు

  • ముగిసిన పంపిణీ గడువు
  • కాకినాడ సిటీ:
    రేష¯ŒS కార్డుదారులకు ప్రభుత్వం క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని చంద్రన్న కానుక పేరుతో అందజేసిన సరుకుల పంపిణీ గడువు బుధవారం రాత్రితో ముగిసింది. క్రిస్మస్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఆయావర్గాల కార్డుదారులకు 15వ తేదీలోపు కానుక కిట్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆదివారం రాత్రి ఈ పోస్‌ సర్వర్‌లో పంపిణీ చేసే ప్రక్రియ ఆగిపోయింది. అయితే ఆ గడువు నాటికి జిల్లాలో సరుకుల పంపిణీ పూర్తికాకపోవడంతో జిల్లా అధికారులు ప్రభుత్వానికి తెలియజేసి మరో రెండు రోజుల గడువు పొడిగించగా మంగళ, బుధవారాల్లో తిరిగి పంపిణీని కొనసాగించారు. కానీ జిల్లా వ్యాప్తంగా సుమారు 90 వేల మంది రేష¯ŒSకార్డుదారులు సరుకులు పొందలేకపోయారు. జిల్లా వ్యాప్తంగా 14 లక్షల 16 వేల 381 మంది కార్డుదారులుండగా, వీరిలో 13 లక్షల 72 వేల 750 మంది సరుకులను తీసుకున్నారు. ఇంకా 43 వేల 631 మంది సరుకులను తీసుకోలేదు. అదేవిధంగా ప్రభుత్వం ఈ నెలలో జన్మభూమి కార్యక్రమం సందర్భంగా మంజూరు చేసిన 89 వేల 203 కార్డుల్లో 42 వేల మంది కార్డుదారులు చంద్రన్న కానుకలను తీసుకున్నారు. ఇంకా 47 వేల 203 మంది సరుకులను తీసుకోలేకపోయారు. అయితే మంజూరైన  కొత్త కార్డుల్లో  లబ్ధిదారులకు ఇప్పటి వరకు  75 వేల కార్డులు పంపిణీ పూర్తి చేశారు. ఇంకా 14 వేల మంది లబ్ధిదారులకు కార్డులు అందాల్సి ఉంది. మంజూరైన కొత్త కార్డుల పంపిణీ జాప్యంతో అర్హులైప లబ్థిదారులు 50 శాతం మంది చంద్రన్న కానుక సరుకులు పొందలేని పరిస్థితి ఏర్పడింది. మరోపక్క కొంత మంది లబ్థిదారుల వేలిముద్రలు, ఐరీస్‌లను ఈ–పోస్‌ మిషన్లు తీసుకోకపోవడంతో వారుకూడా సరుకులు అందుకోలేకపోయారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement