ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గురువారం తిరుపతి చేరుకున్నారు.
తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గురువారం తిరుపతి చేరుకున్నారు. తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఫుడ్ ఫెస్టివల్ను చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ఆయన మరికాసేపట్లో నారావారిపల్లె చేరుకొనున్నారు. నేడు, రేపు నారావారిపల్లెలోనే చంద్రబాబు ఉంటారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో పోలీసులను భారీగా మోహరించారు. అలాగే జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.