ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మహత్యలను ప్రోత్సహిస్తున్నాడని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరాల రమణ విమర్శించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మహత్యలను ప్రోత్సహిస్తున్నాడని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరాల రమణ విమర్శించారు. మొన్న రైతులు, నిన్న విద్యార్థులు, నేడు ఆరోగ్య మిత్రలు ఆత్మహత్యలు పాల్పడడం శోచనీయమన్నారు. ఈ ఆత్మహత్యలకు బాబు వైఖరే కారణమన్నారు. ఆరోగ్యమిత్రల అరెస్ట్‌కు నిరసనగా సోమవారం దాబాగార్డెన్ పరిధిలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. అనంతరం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.