స్థానిక లాల్‌స్వామి మకానం కాలనీకి చెందిన శతాధిక వృద్ధురాలు ముల్లా జైతూన్‌బీ శనివారం వడదెబ్బతో మృతి చెందారు.
వడదెబ్బతో శతాధిక వృద్ధురాలి మృతి
Apr 23 2017 12:04 AM | Updated on Sep 5 2017 9:26 AM
చాగలమర్రి: స్థానిక లాల్‌స్వామి మకానం కాలనీకి చెందిన శతాధిక వృద్ధురాలు ముల్లా జైతూన్‌బీ శనివారం వడదెబ్బతో మృతి చెందారు. వృద్ధురాలు రెండు రోజుల క్రితం వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై శనివారం తెల్లవారు జామున కోలుకోలేక మృతి చెందారు. ఈమెకు 108 సంవత్సరాలు ఉంటాయని కుమారుడు ముల్లా గౌస్‌మోహిద్దీన్ తెలిపారు. మూడేళ్ల క్రితం ఆమెకు దంతాలు ఊడిపోయి పోయి కొత్త దంతాలు వచ్చాయన్నారు. జైతూన్‌బీకు ముగ్గురు కుమారులు ఉండగా ఇద్దరు మృతి చెందారు. ఆమె మృతి పట్ల వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు బాబులాల్, మాజీ సర్పంచ్ అన్సర్‌బాషా, మండల కో ఆప్షన్ సభ్యుడు ముల్లా మాబుబాషా, పారిశ్రామిక వేత్త ఎన్‌ఎండీ హారీస్, న్యాయవాది పీఎస్ మహబూబ్‌బాషా సంతాపం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement