ఆన్‌లైన్‌ సెల్‌ బుకింగ్‌తో మోసం | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ సెల్‌ బుకింగ్‌తో మోసం

Published Fri, Aug 12 2016 11:35 PM

ఆన్‌లైన్‌ సెల్‌ బుకింగ్‌తో మోసం

తొర్రూరు : ఆన్‌లైన్‌ సెల్‌ బుకింగ్‌తో ఓ యువకుడు మోసపోయాడు. తొర్రూరు పట్టణానికి చెందిన ఆబోతు కుమార్‌ అనే యువకుడు సుమా రు రూ. 18,500 విలువ చేసే సామ్‌సంగ్‌ సెల్‌ కోసం గతవారం రోజుల క్రితం అన్‌లైన్‌లో బుకిం గ్‌ చేసుకున్నాడు. ఈ క్రమంలో సామ్‌సంగ్‌ షోరూం హైదరాబాద్‌ నుంచి శుక్రవారం మ ధ్వాహ్నం తొర్రూరుకు వచ్చిన ఫ్యాకింగ్‌ను తీసుకుని తెరిచి చూడగా, అందులో సామ్‌సంగ్‌ సెల్‌కు బదులు ఇనుప ముక్కతోపాటు పాతకాలం నాటి సుమారు రూ.2 వేల విలువ చేసే నోకియా సెల్, బ్యాట్రీ ఉండడంతో యువకుడు కుమార్‌ ఆందోళనకు గురయ్యాడు. సంబంధిత కంపెనీవారిని సమాచారం అందించినా ఏలాంటి ప్రయోజనం లేకపోవడంతో మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement