పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో వేర్వేరు చోట్ల ముగ్గురు ఉపాధ్యాయులు శనివారం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.
స్లిప్పులతో అడ్డంగా దొరికిన ఉపాధ్యాయులు
Mar 26 2017 1:32 AM | Updated on Sep 26 2018 3:25 PM
భీమవరం టౌన్ : పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో వేర్వేరు చోట్ల ముగ్గురు ఉపాధ్యాయులు శనివారం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. వారిని విధుల నుంచి తొలగించిన అధికారులు సమాచారాన్ని డీఈఓ ఆర్‌ఎస్ గంగా భవానికి అందించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు కె.నాగేశ్వరరావు, ఎస్‌కే సలీం తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరంలోని కాకతీయ మెరిట్ స్కూల్ పరీక్ష కేంద్రం (నం.2659)లో రూం నెం.7లో ఇన్విజిలేటర్‌గా ఉన్న ఉపాధ్యాయుడు కె.విజయ్‌బాబు రెండు కార్పొరేట్ స్కూల్స్‌కు చెందిన ఇద్దరు విద్యార్థుల జవాబు పత్రాలను మారుస్తుండగా స్క్వాడ్ పట్టుకుంది. వెంటనే అతడిని ఇన్విజిలేటర్ విధుల నుంచి తొలగించారు. అదేవిధంగా కాళ్ల మండలం కలవపూడి జెడ్పీ హైస్కూ ల్ పరీక్ష కేంద్రం (నం.2705)లో తనిఖీలు చేయగా రూం నం.3లో ఇన్విజిలేటర్‌గా ఉన్న ఉపాధ్యాయు డు వై.శ్రీనివాస్, రూం నం.5లో ఎం ఎన్‌సీహెచ్‌ఎస్ వర్మ జేబుల్లో స్లిప్పులు ఉండటాన్ని స్క్వాడ్ గుర్తించిం ది. వీరిని కూడా విధుల నుంచి తొలగించామని అధికారులు చెప్పారు.
Advertisement
Advertisement