అక్రమ విద్యుత్‌ వాడితే కేసులు | cases for illegal electricity use | Sakshi
Sakshi News home page

అక్రమ విద్యుత్‌ వాడితే కేసులు

Sep 4 2016 9:40 PM | Updated on Sep 4 2017 12:18 PM

గణేష్‌ మండపాలకు ఎవరైనా అక్రమంగా విద్యుత్‌ వాడితే కేసులు నమోదు చేస్తామని విద్యుత్‌ శాఖ ఏపీఎస్‌పీడీసీఎల్‌ కర్నూలు ఆపరేషన్స్‌ ఎస్‌ఈ జి. భార్గవ రాముడు హెచ్చరించారు.

– ఎస్‌ఈ భార్గవ రాముడు
కర్నూలు(రాజ్‌విహార్‌): గణేష్‌ మండపాలకు ఎవరైనా అక్రమంగా విద్యుత్‌ వాడితే కేసులు నమోదు చేస్తామని విద్యుత్‌ శాఖ ఏపీఎస్‌పీడీసీఎల్‌ కర్నూలు ఆపరేషన్స్‌ ఎస్‌ఈ జి. భార్గవ రాముడు హెచ్చరించారు. వినాయక చవితి పండగ సందర్భంగా వాడవాడలా ఏర్పాటు చేసే గణేష్‌ మండపాల అలంకరణ కోసం విద్యుత్‌ను అధికారికంగా ఉపయోగించుకోవాలన్నారు. నిర్వహణ కమిటీలు ముందుగా కంప్యూటర్‌ సర్వీసు సెంటర్లు, ఏఈ సెక్షన్‌ కార్యాలయాల్లో సమాచారం అందించి, విద్యుత్‌ కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలా కాకుండా ఇష్టానుసారంగా విద్యుత్‌ తీగలు తగిలించి  కరెంట్‌ వాడితే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈమేరకు తమకు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. మండపాల వద్ద విద్యుత్‌ లోడు 240 వాట్స్‌లోపు ఉంటే రూ.750, 500 వాట్స్‌లోపు ఉంటే రూ.1000, వెయ్యి వాట్స్‌లోపు ఉంటే రూ.1500, వెయ్యి వాట్స్‌కి మించి లోడు ఉంటే రూ.2450 చొప్పున 9రోజులకు గాను కష్టమర్‌ సర్వీసు సెంటరులో, ఏఈల కార్యాలయాల్లో నగదు చెల్లించి అధికారిక కనెక్షన్‌ పొందాలన్నారు. డబ్బు చెల్లించిన మండపాలకు తమ సిబ్బంది వచ్చి విద్యుత్‌ క¯ð క్షన్‌ ఇవ్వడంతో పాటు జాగ్రత్తలు, సూచనలు చెబుతారని వెల్లడించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement