breaking news
vinayaka mandapam
-
గాడ్జెట్ల గల్లీలో బప్పా ఎంట్రీ!
ఇంటికి గణపయ్య వచ్చారంటే పండగ కళ రావాల్సిందే! ఇప్పుడు ఆ కళను కాస్త స్మార్ట్‌గా పెంచే చిట్టి గాడ్జెట్లు ఇవిగో... దరలో చిన్నవి, పండుగ పనిలో మాత్రం పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయి.బప్పా మండపంలో బీట్ అదిరిపోవాల్సిందే! పిల్లల వినాయక మండపం అంటే పూజలతో పాటు ఆటలు, పాటలు, సందడి కూడా ఉండాల్సిందే! మరి ఆ చిన్నారుల సందడికి పెద్ద సౌండ్ సిస్టమ్ ఎందుకు? తక్కువ ఖర్చులో ఈ చిన్న బ్లూటూత్ స్పీకర్ చాలు! 10 వాట్ల సౌండ్‌తో భక్తి పాటలు, గణేశ్ పాటలు, పిల్లల ఫేవరెట్ మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. మ్యూజిక్కు తగ్గట్టు రంగురంగుల డిస్కో లైట్లు మెరుస్తూ ఉంటే... చిన్న మండపమే మినీ డ్యాన్స్ ఫ్లోర్లా మారిపోతుంది! ఫోన్‌తో బ్లూటూత్ ద్వారా సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. చిన్న సైజులో ఉండటంతో పిల్లలు నిర్వహించే చిన్న వినాయక మండపాలకు ఇది బాగా సరిపోతుంది. పైగా పెద్ద స్పీకర్లు, ఖరీదైన సౌండ్ సిస్టమ్‌లకు అయ్యే ఖర్చు కూడా ఉండదు. ధర కేవలం రూ.500 మాత్రమే!గణపయ్యకు... మేకప్ రెడీ!గణపయ్యను తీసుకొచ్చాక... ఆయన మండపం అలంకరణే అతిపెద్ద టాస్క్! పూలు, లైట్లు, అలంకరణ సామాన్లు అంటూ మార్కెట్ చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా... గణపయ్య వెనుక ఈ మండపం పెట్టేస్తే పూజా స్థలానికే ఓ పండగ లుక్ వచ్చేస్తుంది. కాగితంతో తయారైన ఈ పర్యావరణహిత అలంకరణను 9 నుంచి 16 అంగుళాల విగ్రహాలకు సరిపడేలా రూపొందించారు. కొద్ది నిమిషాల్లోనే కుటుంబంతో కలిసి దీన్ని తయారు చేసుకోవచ్చు కాబట్టి... పిల్లలకు ఫన్, పెద్దలకు డెకరేషన్ బాధ్యత రెండూ ఒకేసారి! వాడిన తర్వాత మడిచి దాచుకోవచ్చు, పైగా వినాయక చవితి తర్వాతి పండుగల్లో మళ్లీ ఉపయోగించుకోవచ్చు. ధర సుమారు రూ. 800.మంత్రాల మినీ మాస్టర్!గణపయ్యపై విపరీతమైన ప్రేమ ఉంది. కానీ మంత్రాలు రావా? పూజ చేయడం కూడా రాదా? పర్లేదు... ఇకపై పూజ చేయటానికి పూజారి కోసం వెతకాల్సిన పనిలేకుండా. ఈ చిన్న మంత్ర బాక్స్ పనిచేస్తుంది. ఇందులో 35 రకాల ముందే నిక్షిప్తమైన మంత్రాలు ఉండటంతో పూజ, ధ్యానం, జపం... ఏ సందర్భానికైనా వినొచ్చు. పెద్ద స్పీకర్ సెటప్ అవసరం లేదు. చిన్న సైజులోనే పూజ గదిలో చక్కగా సరిపోతుంది. బ్యాటరీ లేదా చార్జింగ్ టెన్షన్ లేకుండా నేరుగా విద్యుత్ సాకెట్‌కు అమర్చుకుని ఉపయోగించవచ్చు. కొన్ని క్షణాల్లోనే మనసు భక్తిమయంగా మారిపోయేలా, కావాల్సిన మంత్రాన్ని , శబ్దాన్ని మనకు నచ్చిన స్థాయిలో సర్దుకోవచ్చు. ధర రూ.300. -
గణేష్ మండపంపై కూలిన 6 అడుగుల గోడ
-
ఇలాంటి అన్నదానం చూసుండరు..
-
వినాయక మండపం వద్ద భక్తులకు తప్పిన పెను ప్రమాదం
విశాఖపట్నం: విశాఖపట్నంలో వినాయక మండపం వద్ద భక్తులకు పెను ప్రమాదం తప్పింది. ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన చాక్లెట్ వినాయక మండపం వద్ద ఈదురు గాలులకు మండపంపై రేకులు ఎగిరిపడ్డాయి. దీంతో వెనుకనే కూర్చున్న భక్తులపై సిమెంట్ రేకులు పడ్డాయి. భక్తులు తప్పుకోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఓ వ్యక్తికి తలపై ఇనుప రాడ్డు పడింది. స్వల్ప గాయాలు అయ్యాయి. నిబంధనలు పాటించకుండా స్టాల్స్ ఏర్పాటుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: తిరుమల: నాడు వైఎస్సార్.. నేడు సీఎం జగన్: భూమన -
26 వినాయక మండపాల్లో లడ్డూల చోరీ
చిట్యాల/మీర్‌పేట: వినాయకుడి చేతిలో పూజలందుకున్న లడ్డూలను గణేశ్ నిమజ్జనం రోజున వేలంలో వేలు, లక్షల రూపాయలు పెట్టి దక్కించుకుంటారు. అయితే నల్లగొండ జిల్లా చిట్యాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద నుంచి గుర్తు తెలియని వ్యక్తులు లడ్డూలను ఎత్తుకెళ్లిపోయారు. వినాయక చవితి సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో్ల మండపాలను ఏర్పాటు చేసి గణేశ్ విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే, కొందరు దుండగులు పట్టణంలోని 26 మండపాల్లో ఉన్న లడ్డూలను అపహరించుకుపోయారు. శివాలయం వీధిలో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహం నుంచి లడ్డూను అపహరిస్తున్న క్రమంలో విగ్రహం చేయి విరిగిపోయింది. ఓ వార్డులో లడ్డూ చోరీకి వచ్చిన ఇద్దరు అనుమానితులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో లడ్డూల చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని మండపాల నిర్వాహకులు లడ్డూల చోరీపై ఫిర్యాదు చేయలేదు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలోని డీఎల్ఆర్ కాలనీవాసులు స్థానిక కమ్యూనిటీహాల్లో నెలకొల్పిన వినాయకుడి విగ్రహాన్ని దొంగిలించే యత్నం చేశారు. అదికాస్తా విఫలమవడంతో చేసేది లేక విగ్రహాన్ని రోడ్డుపైనే వదిలేసి పారిపోయారు. -
Ganesh Chaturthi 2022: 'పండుగ వేళ..' కరెంటుతో జాగ్రత్త
సాక్షి, అమరావతి: ఊరూవాడా పూజలందుకునే వినాయకుడి పందిళ్ల వద్ద వేలాది రంగురంగుల విద్యుద్దీపాలు ఏర్పాటవుతున్నాయి. ఆయా పందిళ్ల వద్ద నిరంతరం స్వామి పాటలు వినిపించాలన్నా, పూజా మంత్రాలు భక్తులకు చేరాలన్నా.. లౌడ్ స్పీకర్లు, మైకులు తప్పనిసరి. అదేవిధంగా పెద్దపెద్ద మండపాల వద్ద ఏసీలు, ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రత్యేక విద్యుత్ ఏర్పాట్లు చేస్తున్నారు. వీటన్నిటికీ కరెంటు అవసరం. ఈ కరెంటు విషయంలో అందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అందుకే వినాయక చవితికి విద్యుత్ శాఖ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. భద్రతకు చర్యలు చేపట్టింది. ఆ వివరాలను ఆంధ్రప్రదేశ్ తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీ కె.సంతోషరావు, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ జె.పద్మాజనార్ధనరెడ్డి ‘సాక్షి ప్రతినిధి’కి వెల్లడించారు. వారు చెప్పినదాని ప్రకారం.. ► వినాయక ఉత్సవాల్లో విద్యుత్ శాఖకు సంబంధించిన అన్నిరకాల సేవలను పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాలోను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు బాధ్యతలు అప్పగించారు. వీరు డివిజనల్ ఇంజనీర్లతో సమన్వయం చేసుకుంటారు. ► క్షేత్రస్థాయిలో నిర్వాహకులు, భక్తులకు సహకరించడం, విద్యుత్ సర్వీస్, ప్రమాదాలపై వారికి అవగాహన కల్పించడం కోసం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ముగ్గురు సభ్యులతో ఏర్పాటైన బృందాలు ప్రతి మండపం వద్దకు తిరుగుతూ విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు చెబుతుంటాయి. ► ప్రతి మండలానికి ఒక సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ అందుబాటులో ఉంటారు. ఏదైనా పెద్ద సమస్య ఏర్పడితే ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతారు. ► మండపంలో విద్యుత్ కోసం ముందుగా విద్యుత్ శాఖ నుంచి లోడ్ ప్రకారం నిర్ణీత రుసుము చెల్లించి అనుమతి పొందాలి. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన వారికి ఎలక్ట్రికల్ ఇంజనీర్లు విద్యుత్ ప్రమాదాలపై పలు సూచనలు చేస్తున్నారు. ► మండపంలో ఉండే విద్యుత్ పరికరాల లోడ్‌కు తగిన నాణ్యమైన కేబుల్స్ వాడాలి. జాయింట్లు ఉన్న, ఇన్సులేషన్‌లేని వైర్లను వాడటం అపాయకరం. వైరింగ్‌ను లైసెన్స్ కలిగిన ఎలక్ట్రీషియన్ చేత మాత్రమే చేయించుకోవాలి. ముఖ్యంగా లోడ్‌కు తగిన కెపాసిటీ కలిగిన ఎంసీబీ (మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్)లను తప్పనిసరిగా వాడాలి. ఒకవేళ ఎంసీబీలు ఓవర్ లోడ్ అయితే షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదాలు జరగవచ్చు. ► విద్యుత్ సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద గణేష్ మండపాలను ఏర్పాటు చేయరాదు. విద్యుత్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్ల దిమ్మెలను మండపాలకు సపోర్ట్ కోసం వాడరాదు. విద్యుత్ వైర్లు, పోల్స్, ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాలు మండపాల పరిసరాల్లో ఉంటే వాటిని పరిశీలించి వాటి నుంచి దూరంగా ఉండాలి. ► వినాయక మండపాలకు విద్యుత్ సరఫరా కనెక్షన్ కోసం విద్యుత్ స్తంభాలు ఎక్కకూడదు. విద్యుత్ శాఖ సిబ్బందిని సంప్రదిస్తే వారు మండపం వద్దకు వచ్చి పరిశీలించి కనెక్షన్ ఇస్తారు. ► ఒకవేళ ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలినా, విద్యుత్ లైన్లు ఎక్కడైనా తెగిపడినా, ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినా వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1912కు గానీ, సమీప ఫ్యూజ్ ఆఫ్ కాల్‌కు గానీ కాల్చేసి విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలి. -
అక్రమ విద్యుత్ వాడితే కేసులు
– ఎస్ఈ భార్గవ రాముడు కర్నూలు(రాజ్‌విహార్): గణేష్ మండపాలకు ఎవరైనా అక్రమంగా విద్యుత్ వాడితే కేసులు నమోదు చేస్తామని విద్యుత్ శాఖ ఏపీఎస్పీడీసీఎల్ కర్నూలు ఆపరేషన్స్ ఎస్ఈ జి. భార్గవ రాముడు హెచ్చరించారు. వినాయక చవితి పండగ సందర్భంగా వాడవాడలా ఏర్పాటు చేసే గణేష్ మండపాల అలంకరణ కోసం విద్యుత్‌ను అధికారికంగా ఉపయోగించుకోవాలన్నారు. నిర్వహణ కమిటీలు ముందుగా కంప్యూటర్ సర్వీసు సెంటర్లు, ఏఈ సెక్షన్ కార్యాలయాల్లో సమాచారం అందించి, విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలా కాకుండా ఇష్టానుసారంగా విద్యుత్ తీగలు తగిలించి కరెంట్ వాడితే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈమేరకు తమకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. మండపాల వద్ద విద్యుత్ లోడు 240 వాట్స్‌లోపు ఉంటే రూ.750, 500 వాట్స్‌లోపు ఉంటే రూ.1000, వెయ్యి వాట్స్‌లోపు ఉంటే రూ.1500, వెయ్యి వాట్స్‌కి మించి లోడు ఉంటే రూ.2450 చొప్పున 9రోజులకు గాను కష్టమర్ సర్వీసు సెంటరులో, ఏఈల కార్యాలయాల్లో నగదు చెల్లించి అధికారిక కనెక్షన్ పొందాలన్నారు. డబ్బు చెల్లించిన మండపాలకు తమ సిబ్బంది వచ్చి విద్యుత్ క¯ð క్షన్ ఇవ్వడంతో పాటు జాగ్రత్తలు, సూచనలు చెబుతారని వెల్లడించారు.


