సొమ్ము కాజేసిన కాంట్రాక్టు ఉద్యోగిపై కేసు | case file on contract employe due to cash theft | Sakshi
Sakshi News home page

సొమ్ము కాజేసిన కాంట్రాక్టు ఉద్యోగిపై కేసు

Nov 2 2016 12:19 AM | Updated on Sep 4 2017 6:53 PM

ఏలూరు అర్బన్‌ : ప్రభుత్వ సొమ్ము కాజేసిన కాంట్రాక్టు ఉద్యోగిపై త్రీటౌన్‌ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

ఏలూరు అర్బన్‌ : ప్రభుత్వ సొమ్ము కాజేసిన కాంట్రాక్టు ఉద్యోగిపై త్రీటౌన్‌ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. సిరిగిరి వెంకట శివనాగప్రసాద్‌ జంగారెడ్డిగూడెంలోని ఉద్యానవనశాఖలో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ) ఎ.దుర్గేష్‌  బ్యాంకులో శాఖ పేరిట జమ చేయాలని  రూ.11,45,251 విలువైన బేరర్‌ చెక్‌ను వెంకట శివనాగ ప్రసాద్‌కు ఇచ్చారు. ఆ చెక్‌ను మార్చుకున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగి దాదాపు రూ.రెండు లక్షలు కాజేసి మిగిలిన మొత్తాన్ని బ్యాంకులో జమ చేశాడు. దీనిని గుర్తించిన  ఏడీ దుర్గేష్‌ త్రీ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంకట శివనాగ ప్రసాద్‌పై మంగళవారం మోసం కేసు నమోదు చేశారు.   
 
 
 
 
 
 
 
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement