2.40 క్వింటాళ్ల గంజాయి పట్టివేత | Capture 2.40 quintals of cannabis | Sakshi
Sakshi News home page

2.40 క్వింటాళ్ల గంజాయి పట్టివేత

Jun 23 2016 10:46 AM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లా సూర్యాపేట పోలీసులు పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు.

నల్లగొండ జిల్లా సూర్యాపేట పోలీసులు పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. గురువారం ఉదయం పట్టణ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విశాఖ నుంచి వస్తున్న బొలెరోను సోదా చేయగా అందులో 2.40 క్వింటాళ్ల గంజాయి బయటపడింది.

 

ఇందుకు సంబంధించి వాహనంలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.10 లక్షలు ఉంటుంది. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. నిజామాబాద్, విశాఖ జిల్లాలకు చెందిన వీరంతా గంజాయిని అక్రమంగా నిజామాబాద్‌కు తరలిస్తున్నారు. గంజాయితోపాటు వాహనాన్ని సీజ్ చేసి, నిందితులను స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నట్లు సీఐ మొగులయ్య తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement