మాజీ సర్పంచ్ దారుణ హత్య | brutal murder of former sarpanch | Sakshi
Sakshi News home page

మాజీ సర్పంచ్ దారుణ హత్య

Jan 6 2016 8:35 AM | Updated on Sep 19 2019 2:50 PM

విశాఖలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు.

జీకేవీధి: బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వకూడదని పులుమార్లు హెచ్చరించినా.. లెక్క చేయకుండా జన్మభూమి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన టీడీపీ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్‌ను మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ సంఘటన విశాఖపట్నం ఎజెన్సీ ప్రాంతంలోని జీకేవీధి మండలం జర్రెల గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎస్. వెంకటరమణ(36) మంగళవారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొందరు సాయుధులైన మావోలు ఆయన ఇంట్లోకి ప్రవేశించి ఆయనను బయటకు తీసుకొచ్చి గ్రామస్థులంతా చూస్తుండగా.. కాల్చి చంపారు. బాక్సైట్ జోలికి ఎవరు వచ్చినా వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ఈ ఘటనలో సుమారు 500 మంది మావోలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. మావోల భయంతో గత కొంత కాలంగా చింతపల్లిలో ఉంటున్నారు. బందువుల ఇంట్లో వివాహానికి హాజరైన నేపథ్యంలో ఆయన మావోల చేతిలో హత్యకు గురయ్యారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement