
విరబూసిన బ్రహ్మకమలాలు
చిత్తూరు జిల్లాలోని బి.కొత్తకోట, ములకలచెరువు మండలాల్లో మంగళవారం రాత్రి బ్రహ్మకమలాలు విరగబూశాయి.
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని బి.కొత్తకోట, ములకలచెరువు మండలాల్లో మంగళవారం రాత్రి బ్రహ్మకమలాలు విరగబూశాయి. ఒక్కో మొక్కలో 50 నుంచి 120 పూవ్వులు పూశాయి. వీటీని తిలకించేందుకు స్థానికులు తండోపతండాలుగా తరలివస్తుండటం విశేషం. ములకలచెరువు మండలం బురకాయలకోటలోని పూల సరోజమ్మ ఇంటి పెరట్లో నాలుగేళ్ల క్రితం మొక్కను నాటింది. ఇప్పటివరకు ఏనాడూ పూయని విధంగా మంగళవారం రాత్రి 10 గంటల సమయం తర్వాత 150 పువ్వులు విరబూశాయి.
వీటిని తిలకించేందుకు స్థానికులు ఎగబడ్డారు. కొందరు పూలను కొసుకెళ్లారు. బి.కొత్తకోట పాశంవీధిలోని గంజిమోహన ఇంటి పెరట్లోని మొక్కకు రాత్రి 9.30గంటల సమయంలో 51 బ్రహ్మకమలాలు విరబూశాయి. దీన్ని చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. పిల్లలు, మహిళలు ఫోటోలు తీసుకొన్నారు.