కరీంనగర్ మండలం నగునూరుశివారులో డి–89 ఎస్సారెస్పీ కాలువకు కొందరు రైతులు గండికొట్టడం వివాదస్పదంగా మారింది. గ్రామ సమీపంలోని కాలువకు చొప్పదండి మండలం రుక్మాపూర్‌కు చెందిన రైతులు గురువారం తెల్లవారు జామున గండికొట్టారు.
ఎస్సారెస్పీకాలువకు గండి
Aug 12 2016 12:04 AM | Updated on Sep 4 2017 8:52 AM
	 కరీంనగర్ రూరల్: కరీంనగర్ మండలం నగునూరుశివారులో డి–89 ఎస్సారెస్పీ కాలువకు కొందరు రైతులు గండికొట్టడం వివాదస్పదంగా మారింది. గ్రామ సమీపంలోని కాలువకు చొప్పదండి మండలం రుక్మాపూర్‌కు చెందిన రైతులు గురువారం తెల్లవారు జామున గండికొట్టారు. కాలువ వద్దే రైతులు పెద్దసంఖ్యలో మోహరించి చెరువుకు నీటిని తరలించడంతో చివరి ఆయకట్టు గ్రామాలకు నీళ్లందని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సారెస్పీ అధికారులకు అక్రమ నీటితరలింపుపై ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
