బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.200 కోట్లు కేటాయించాలి | braman corporation demands for funds over development | Sakshi
Sakshi News home page

బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.200 కోట్లు కేటాయించాలి

Mar 12 2017 11:35 PM | Updated on Sep 5 2017 5:54 AM

బ్రాహ్మణ కార్పొరేషన్‌కు తక్షణమే చట్టబద్ధత కల్పించి రూ.200 కోట్ల బడ్జెట్‌ను అసెంబ్లీ సమావేశాల్లో కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

పాత గుంటూరు : బ్రాహ్మణ కార్పొరేషన్‌కు తక్షణమే చట్టబద్ధత కల్పించి రూ.200 కోట్ల బడ్జెట్‌ను అసెంబ్లీ సమావేశాల్లో కేటాయించాలని బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య జిల్లా అధ్యక్షులు ముత్తనపల్లి శివరామకృష్ణ ప్రసాద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పండరీపురంలోని ఆంధ్ర వల్క క్షేత్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ ప్రకారం జరిగిన ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రాధాన్యత ఇవ్వనందున, రాబోయే గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవిని బ్రాహ్మణులకు కేటాయించాలని కోరారు. జిల్లాలో కార్పొరేషన్‌ ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి బ్రాహ్మణ సమాఖ్య ద్వారా లబ్ధి చేకూర్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ రమణయశస్వి, కార్యదర్శి తుళ్లూరు ప్రకాష్, కోశాధికారి సోమరాజు శ్రీనివాస్, పాండురంగారావు, కోనంకి మారుతి, పులిపాక ప్రసాద్, సుబ్రహ్మణ్యం, మద్దాలి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement