కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు | Brake failure causes fire in Krishna Express, resumption of service after refurbishment | Sakshi
Sakshi News home page

కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

May 19 2016 12:16 PM | Updated on Sep 5 2018 9:47 PM

కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో గుంటూరు జిల్లాలోని బాపట్ల స్టేషన్ లో రైలును నిలిపివేశారు.

బాపట్ల: కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో గుంటూరు జిల్లాలోని బాపట్ల స్టేషన్ లో రైలును నిలిపివేశారు. తిరుపతి నుంచి ఆదిలాబాద్ కు బయలుదేరిన కృష్ణా ఎక్స్ ప్రెస్ డీ-5 బోగి బ్రేకులు ఫెయిల్ కావడంతో బాపట్ల వద్ద మంటలు అలుముకున్నాయి. దీంతో బోగీలో నుంచి పొగలు వస్తుండటాన్ని గమనించిన సిబ్బంది వెంటనే రైలు నిలిపివేశారు. హుటాహూటిన బోగీని చేరుకున్న రైల్వే సాంకేతిక శాఖకు చెందిన అధికారులు మరమ్మత్తులు చేస్తున్నారు. బ్రేకులను పునరుద్దరణ అనంతరం రైలు బయలుదేరుతుందని స్టేషన్ మాస్టర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement