హైదరాబాద్ కు వంశీకృష్ణ అవయవాలు | Brain dead Vamsi Krishna's organ reaches to Hyderabad | Sakshi
Sakshi News home page

వంశీకృష్ణ అవయవాలు దానం

Oct 19 2016 1:36 PM | Updated on Aug 18 2018 4:27 PM

విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో ఓ యువకుడికి బ్రెయిన్‌ డెడ్‌ అయింది.

హైదరాబాద్ : విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో ఓ యువకుడికి బ్రెయిన్‌ డెడ్‌ అయింది. తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన వంశీకృష్ణ కోమాలోకి వెళ్లినట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. బ్రెయిన్‌ డెడ్‌ అని వైద్యులు చెప్పడంతో జీవన్‌దాన్‌ ద్వారా అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. దీంతో ఆంధ్రా ఆసుపత్రిలో ఆపరేషన్‌ నిర్వహించారు.

వంశీకృష్ణ గుండెను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి.. లివర్‌ను యశోద ఆసుపత్రికి తరలించారు. అవయవాల తరలింపు సందర్భంగా విజయవాడ నగరంలో పోలీసులు గ్రీన్‌ ఛానల్‌ చేపట్టి... బెంజి సర్కిల్‌ నుంచి గన్నవరం వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో అవయవాలను హైదరాబాద్‌కు తరలించారు. వంశీకృష్ణ.. మూత్రపిండాలు, కళ్లు విజయవాడలోని వివిధ ఆస్పత్రుల్లో బాధితులకు వినియోగించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement