ఆర్టీసీ బస్సును ఢీకొన్న బొలేరో | bolero hits the RTC bus | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సును ఢీకొన్న బొలేరో

Jul 17 2016 10:03 PM | Updated on Sep 4 2017 5:07 AM

ఆర్టీసీ బస్సును ఢీకొన్న బొలేరో

ఆర్టీసీ బస్సును ఢీకొన్న బొలేరో

ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బొలేరో ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన పుల్లలచెరువు మండలం నరజాముల తండా సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగింది.

– ఆరుగురికి తీవ్రగాయాలు
యర్రగొండపాలెం టౌన్‌ :
ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బొలేరో ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన పుల్లలచెరువు మండలం నరజాముల తండా సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగింది. గిద్దలూరుకు చెందిన కొందరు బొలేరోలో మాచర్ల Ðð ళ్తున్నారు. మాచర్ల నుంచి మార్కాపురం వస్తున్న ఆర్టీసీ బస్సును నరజాముల తండా మలుపు వద్ద బొలేరో ఢీకొంది. ప్రమాదంలో బొలేరోలో ప్రయాణిస్తున్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో వర్షం కురుస్తుండటంతో ఎదురుగా వస్తున్న బస్సును డ్రైవర్‌ గుర్తించలేకపోయాడు. ప్రమాదంలో రంగస్వామి, బాపయ్య, డ్రైవర్‌ శివ తలలకు తీవ్రగాయాలయ్యాయి. వీరితో పాటు వాహనంలో ప్రయాణిస్తున్న నాయబ్‌ రసూల్, వెంకటయ్య, మహేశ్వరరెడ్డిలూ గాయపడ్డారు. ఆర్టీసీ బస్సులోనే క్షతగాత్రులను యర్రగొండపాలెంలోని రవీంద్ర నర్సింగ్‌ హోమ్‌కు తరలించారు.  
 
 

Advertisement
 
Advertisement
Advertisement