సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ బోల్తా పడటంతో ఒకరు చనిపోయారు.
భోగాపురం: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ బోల్తా పడటంతో ఒకరు చనిపోయారు. మరో ముగ్గురు స్వల్పంగా గాయాలపాలయ్యారు. ఈ ఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపలకంచేరు వద్ద చోటుచేసుకుంది. గురువారం వేకువజామున గ్రామానికి చెందిన ఆరుగురు పడవలో వేటకు బయలుదేరారు. ఉదయం సమయంలో వేట ముగించుకుని తిరిగి వస్తుండగా అలల ఉధృతికి వారి పడవ బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న అరజల్ల ఎర్రన్న(50) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. మిగిలిన వారిలో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు.