'వచ్చే ఎన్నికల్లో విజయం మాదే' | bjp will won in next general election | Sakshi
Sakshi News home page

'వచ్చే ఎన్నికల్లో విజయం మాదే'

Aug 1 2016 9:33 PM | Updated on Sep 4 2017 7:22 AM

భవిష్యత్తు బీజేపీదేనని, వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమని నిజమాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

  • ప్రధాని మోడీ సభను జయప్రదం చేయాలి
  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి
వినాయక్‌నగర్‌: భవిష్యత్తు బీజేపీదేనని, వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమని నిజమాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిధులిస్తుంటే, టీఆర్‌ఎస్‌ సర్కారు మాత్రం నిరంకుశ పాలన సాగిస్తోందని ఆరోపించారు. ఈ నెల 7న మెదక్‌ జిల్లా గజ్వెల్‌లో నిర్వహించనున్న ప్రధాని మోడీ బహిరంగ సభ పోస్టర్లను ఆయన సోమవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆవిష్కరించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ కథ ముగిసిందని, టీడీపీకి క్యాడర్‌ కరువైందని, టీఆర్‌ఎస్‌ సర్కారుకు రోజురోజుకు ఆదరణ తగ్గుతోందన్నారు. రానున్న రోజుల్లో బీజేపీకే భవిష్యత్తు ఉందని చెప్పారు. ఈ నేతలు బాల్‌రాజ్, జాలిగం గోపాల్, గంగాధర్, యెండల సుధాకర్, న్యాలం రాజు, లింగం, భూమేశ్, నాగరాజు, రోషన్‌ లాల్‌ భోరా, ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement