ప్రభుత్వానివి మాటలే.. చేతల్లేవ్.. | BJP protest in front of the Collectorate | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానివి మాటలే.. చేతల్లేవ్..

Nov 5 2016 1:00 AM | Updated on Mar 29 2019 9:31 PM

ప్రభుత్వానివి మాటలే.. చేతల్లేవ్.. - Sakshi

ప్రభుత్వానివి మాటలే.. చేతల్లేవ్..

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అనుసరిస్తున్న తీరుకు నిరసనగా శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా

ఇందూరు : రాష్ట్ర  ప్రభుత్వం ప్రజలపై అనుసరిస్తున్న తీరుకు నిరసనగా శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్వో పద్మాకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు పూర్తయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదన్నారు. డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల పథకం ఒక్కరికి కూడా కట్టి ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు.

ఎంతో మంది ఈ పథకం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. ఇతర పథకాల్లో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరి చూపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సూర్యనారాయణగుప్తా, బాల్‌రాజు, దేవేందర్‌రెడ్డి, భరత్‌భూషణ్, మల్లేశ్‌యాదవ్, రోషన్‌బోరా, లింగం, స్వామి, నాగరాజు, గణేష్, సుగుణ, శోభ, పుష్ప తదితరులు పాల్గొన్నారు.  ఎన్డీఎస్‌ఎల్‌ను తక్షణమే పునరుద్ధరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement