రాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నారు.
కడప: రాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులపై కేసులు నమోదు చేయాలని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సహా కాంగ్రెస్ నేతలు ధర్నా చేయగా.. ఇప్పుడు బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేస్తున్నారు.
దశ, దిశ లేకుండా ఆంధ్రప్రదేశ్ను అడ్డగోలుగా విభజించారంటూ బీజేపీ నేతలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కడప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోనియా గాంధీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, రఘువీరారెడ్డిలపై కూడా బీజేపీ నేతులు ఫిర్యాదు చేశారు.