కామవరపుకోట: జూదం అతని పాలిట మృత్యువయ్యింది. కోడి పందాల్లో జరిగిన గొడవ నిండు ప్రాణాలను బలిగొంది.
కామవరపుకోట: జూదం అతని పాలిట మృత్యువయ్యింది. కోడి పందాల్లో జరిగిన గొడవ నిండు ప్రాణాలను బలిగొంది. కామవరపుకోట శివారు కొండగూడెం వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించి చింతలపూడి సీఐ జి.దాసు తెలిపిన వివరాలిలా ఉన్నా యి.. మండలంలోని ఉప్పలపాడు పంచాయతీ పరిధిలోని గొల్లగూడెంకు చెందిన వీరవల్లి వీరాస్వాములు (45)కు కోడి పందాలు ఆడే అలవాటు ఉంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పందాలకు వెళ్లాడు. అక్కడ వీరాస్వాములుకు, మరికొందరితో గొడవ జరగ్గా కొద్దిసేపటికి ఎవరికి వారు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో సాయంత్రం కామవరపుకోట శివారు కొండగూడెం వాటర్ ప్లాంట్ వద్ద వీరు మళ్లీ ఘర్షణకు దిగారు. ఈ సమయంలో వీరాస్వాములు తలపై ప్రత్యర్థి వర్గం వారు బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితులను గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలి పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు తరలించారు. ఇదిలా ఉండగా వీరాస్వాములు ఉదయం పచ్చిమిరపకాయల బస్తా వేసుకుని కామవరపుకోట వెళ్లాడని స్థానికులు చెబుతున్నా రు. మృతునికి భార్య జ్ఞానేశ్వరి, వివాహిత అయిన కుమార్తె, కుమారుడు నాగరాజు ఉన్నారు. కుటుంబ పెద్ద అకాల మరణంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.