2016–17 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్‌లో ప్రతిభ చాటిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది.
– 39 మంది ఇంటర్ విద్యార్థులకు ప్రతిభా అవార్డులు
– త్వరలో సీఎం చేతుల మీదుగా అందజేత
అనంతపురం ఎడ్యుకేషన్: 2016–17 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్‌లో ప్రతిభ చాటిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. జిల్లాలో 39 మంది విద్యార్థులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. వీరందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నారు. అయితే పురస్కారాల పంపిణీ తేదీ, వేదిక ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. జిల్లాకు సంబంధించిన జాబితా బుధవారం ఆర్‌ఐఓ కార్యాలయానికి చేరింది.