లేపాక్షి ఆలయం సందర్శించిన బళ్లారి ఎస్పీ | bellary sp visits lepakshi | Sakshi
Sakshi News home page

లేపాక్షి ఆలయం సందర్శించిన బళ్లారి ఎస్పీ

Jan 18 2017 9:53 PM | Updated on Sep 5 2017 1:32 AM

ప్రముఖ పర్యాటక కేంద్రం లేపాక్షి ఆలయాన్ని కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్పీ) ఆర్‌ చేతన్‌ బుధవారం మధ్యాహ్నం సందర్శించారు.

లేపాక్షి : ప్రముఖ పర్యాటక కేంద్రం లేపాక్షి ఆలయాన్ని కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్పీ) ఆర్‌ చేతన్‌ బుధవారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలు, అపురూపమైన, అద్భుతమైన కట్టడాలను తిలకించి ఆనందించారు.

అర్ధంతరంగా ఆగిపోయిన పార్వతీ పరమేశ్వరుడి కల్యాణ మండపం, లతా మండపంలో వివిధ రకాల్లో చెక్కిన డిజైన్లను తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా  హిందూ దేవాదాయ, ధర్మాదాయ ఆచారం మేరకు అర్చకులు ఆయనను సన్మానించారు. లేపాక్షి తహశీల్దార్‌ ఆనందకుమార్, ఎస్‌ఐ శ్రీధర్‌ ఆయన వెంట ఉన్నారు.

Advertisement

పోల్

Advertisement