breaking news
visits lepakshi
-
లేపాక్షి ఆలయం సందర్శించిన బళ్లారి ఎస్పీ
లేపాక్షి : ప్రముఖ పర్యాటక కేంద్రం లేపాక్షి ఆలయాన్ని కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ఆర్ చేతన్ బుధవారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలు, అపురూపమైన, అద్భుతమైన కట్టడాలను తిలకించి ఆనందించారు. అర్ధంతరంగా ఆగిపోయిన పార్వతీ పరమేశ్వరుడి కల్యాణ మండపం, లతా మండపంలో వివిధ రకాల్లో చెక్కిన డిజైన్లను తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ దేవాదాయ, ధర్మాదాయ ఆచారం మేరకు అర్చకులు ఆయనను సన్మానించారు. లేపాక్షి తహశీల్దార్ ఆనందకుమార్, ఎస్ఐ శ్రీధర్ ఆయన వెంట ఉన్నారు. -
పూర్తిస్థాయి వైద్యసేవలే లక్ష్యం
హిందూపురం అర్బన్ : పేదలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వైద్య బృందం సభ్యులు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) ప్రొఫెసర్ లేఖసుబ్బయ్య, సహాయకులు డాక్టర్ ప్రభుస్వామి అన్నారు. బుధవారం హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో కేంద్ర వైద్య బృందం సభ్యులు పర్యటించారు. ముందుగా లేబర్ వార్డు, చిన్నపిల్లల, మెడికల్ వార్డులు, కొత్తగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించారు. జనఽనీ సురక్షçయోజన, మెడాల్ ల్యాబ్, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ పనితీరు, చైల్డ్‌కేర్ వంటి పథకాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు, వాటి వినియోగం గురించి ఆరా తీశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర వైద్య పథకాల అమలు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ధర్మవరం, హిందూపురం ఏరియా ఆస్పత్రులను సందర్శించామన్నారు. హిందూపురం ఆస్పత్రిలో వసతులు బాగున్నాయని, అయితే సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని గుర్తించామన్నారు. కార్యక్రమంలో డీపీఓ కిషోర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, మెడికల్ ఆఫీసర్ పోలప్ప, ఆర్ఓ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన వైద్యబృందం లేపాక్షి : కేంద్ర వైద్య బృందం సభ్యులు హిందూపురం ఆస్పత్రి పరిశీలన అనంతరం బుధవారం లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. శిల్పాలు, చిత్రాలు తిలకించి, ఆలయ విశిష్టత గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు.